శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (10:47 IST)

తూగోలో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. జిల్లాలోని కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. 
 
ఈ హాస్టల్‌లో సుమారు 200 మంది వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 16 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన విద్యార్థులను హాస్టల్‌‌లోనే ఐసోలేషన్‌‌లో ఉంచారు. 
 
ఇటీవల ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీ‌లో ఫంక్షన్‌కు వెళ్లొచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ విద్యార్థి కారణంగానే హస్టల్‌ కరోనా వ్యాప్తి చెందినట్లు వారు పేర్కొంటున్నారు.