సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (10:28 IST)

దేశంలో కొత్తగా మరో 14 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 14 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,348 మంది కోవిడ్‌బారిన పడ్డారు. మరో 805 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 13,198 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది.
 
ఇకపోతే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,46,157కు చేరుకోగా, మొత్తం రికవరీ కేసులు 3,36,27,632కి పెరిగాయి. 
 
మరోవైపు, ఇప్పటివరకు 1,04,82,00,966 మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని బులెటిన్‌లో పేర్కొంది. ఇక, కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,57,191గా ఉండగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,61,334గా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.