1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (10:33 IST)

దేశంలో మళ్లీ క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల 13 వేల దిగువకు చేరుకున్న రోజువారి నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 16 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో (బుధవారం) కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,31,809కు పెరిగాయి. ఈ కేసులో ఇందులో 1,60,989 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,36,14,434 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,56,386 మంది వైరస్‌ వల్ల మరణించారు.
 
దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 27 వరకు 60,44,98,405 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. ఇందులో నిన్న ఒక్కరోజే 12,90,900 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.