చల్లారని పెట్రో మంట : తాజాగా 35 పైసలు వడ్డన
దేశంలో పెట్రో మంట ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. గత నెల చివరి వారం నుంచి వరుసగా పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యుడి బతుకు భారమవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతుండటంతో నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నా.. మరోవైపు సాధారణ ప్రజానీకం గగ్గోలు పెడుతున్నా ఆయిల్ కంపెనీలతో పాటు.. కేంద్రం మాత్రం తమకేం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి.
ఇప్పటికే రికార్డు స్థాయిలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.108.29, డీజిల్ ధర రూ.97.02కు చేరాయి.
ఇక ముంబైలో పెట్రల్ రూ.114.14, డీజిల్ రూ.105.12కు చేరగా, చెన్నైలో పెట్రోల్ రూ.105.13, డీజిల్ రూ.101.25, కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.78, డీజిల్ రూ.100.14కు చేరాయి.
తాజా పెంపుతో లీటరు పెట్రోల్, డీజిల్‌పై 36 పైసలు, 38 పైసల చొప్పున అధికమయ్యాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు డీజిల్ ధర రూ.105.84, పెట్రోల్ రూ.112.63కు పెరిగింది.