మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి...
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు అడ్డూఆపూ లేకుండా పోతోంది. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో ధరల్లో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్‌లోనూ మరోసారి ధరలు ఎగబాకాయి.
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.37 పైసలు పెరిగి రూ.111.55 అయింది. డీజిల్ ధర రూ.0.40 పైసలు పెరిగి రూ.104.70గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.50 పైసలు తగ్గి రూ.111.27 అయింది. డీజిల్ ధర రూ.0.57 పైసలు పెరిగి రూ.104.43 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా కాస్త తగ్గింది. ప్రస్తుతం రూ.113.49 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.0.81 పైసలు పెరిగి రూ.106.23కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.107.59కి చేరగా, డీజిల్ ధర రూ.96.32కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.113.46, డీజిల్ రూ.104.38కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.11, డీజిల్ రూ.99.43, చెన్నైలో పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59కి చేరాయి.