గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:01 IST)

దేశంలో భయపెడుతున్న టమోటా ధర

దేశంలో టమోటా ధర భయపెడుతుంది. దేశ వ్యాప్తంగా టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ధరలు పెద్దోళ్ల నుంచి సామాన్యుల వరకు బెంబేలెత్తిపోతున్నారు. 
 
కూర ఏదైనా టమాటా తప్పనిసరి కావడంతో అది కొనకుండా, దానిని వాడకుండా వంట కార్యక్రమం పూర్తికావడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా పంట దారుణంగా దెబ్బతింది.
 
మరీ ముఖ్యంగా టమాటా ఎక్కువగా సరఫరా అయ్యే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు పంటను దారుణంగా దెబ్బతీశాయి. దీంతో ఒక్కసారిగా సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరిగిపోయింది. 
 
కోల్‌కతాలో కిలో టమాటా ధర రూ.93కు చేరుకోగా, చెన్నైలో రూ.60, ఢిల్లీలో రూ.59, ముంబైలో రూ.53గా ఉంది. మరో 50 నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దాదాపు ప్రతి చోట కిలో టమాటా ధర రూ.50 దాటేసింది. హైదరాబాద్‌లో కిలో రూ.70-80 మధ్య పలుకుతోంది.