మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (19:08 IST)

పెట్రోల్ ధర రూ.200కు చేరుకుంటే.. టూ-వీలర్‌పై ట్రిపుల్ రైడింగ్‌

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అస్సోం బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 200 రూపాయలకు చేరుకుంటే టూ-వీలర్‌పై ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సూచిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అంతేకాదు.. పెట్రోల్ లీటర్ ధర రూ.200కు చేరుకున్నప్పుడు టూ-వీలర్ వెహికల్ తయారీ సంస్థలు కూడా ముగ్గురు కూర్చునేందుకు వీలుగా వాహనాలను తయారు చేయాలని అస్సోం బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
దీంతో.. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు ముగ్గురు బయటకు వెళ్లాల్సి వస్తే కారుకు బదులుగా బైక్‌పై వెళుతున్నారని చెప్పడమే తన వ్యాఖ్యల ఉద్దేశమని వివరణ ఇచ్చారు.