బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (17:20 IST)

జార్ఖండ్ - అస్సాం రాష్ట్రాల్లో భూకంపం

జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఆదివారం భూకంపం సంభవించింది. తొలుత జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో భూకంపం సంభవించగా ఆ తర్వాత కొద్దిసేపటికే అస్సాంలోని తేజ్‌పూర్‌లో భూమి కంపిపంచింది. దాంతో ఆయనా ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
 
కాగా, సింగ్‌భూమ్‌లో 2.22 గంటలకు, తేజ్‌పూర్‌లో 2.40 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. ఇక అస్సాంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8 గా నమోదుకాగా, జార్ఖండ్‌లో 4.1 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. ఇవి స్వల్ప ప్రకంపనలే అని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా, ఈ ఘటనలో ఎలాటి ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించలేదని అధికారులు ప్రకటించారు.