శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:01 IST)

ఆ మూడు రాష్ట్రాల్లో బాలికలపై వరుస అత్యాచారాలు

ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​, మహారాష్ట్రల్లో అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తుపాకీతో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి ముగ్గురు కిరాతుకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
అదేవిధంగా మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. ఝార్ఖండ్​లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్​ఫాదర్)​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
యూపీలోని ముజఫర్ నగర్‌లో చెత్త పారవేయడానికి బయటకు వెళ్లిన బాలికను తపాకీతో బెదిరించిన ముగ్గురు వ్యక్తులు ఆ బాలికను అడవిలోకి కిడ్నాప్ చేశారు. అనంతరం అత్యాచారం చేసి అక్కడే విడిపెట్టారు. 
 
అయితే ఇటి నుంచి బయటకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పరిసర ప్రాంతాల్లో గాలించారు. చివరికి బాధితురాలి జాడ తెలుసుకుని రక్షించారు. 
 
నిందితులను మందలించడానికి ప్రయత్నించినప్పుడు బాధితురాలి కుటుంబసభ్యులపై వారు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రాజీవ్​, గుద్దు, అషులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు