శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (20:13 IST)

కదులుతున్న బస్సులో బాలికపై లైంగికదాడి.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై లైంగికదాడులు ఆగడంలేదు. తాజాగా కదులుతున్న ఓ బస్సులో బాలికపై లైంగికదాడి చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బదర్‌పుర్ నుంచి ఆరియాకు వెళ్తున్న బస్సులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. బాధిత బాలిక కుటుంబం సోమవారం రాత్రి 11 గంటలకు బదర్‌పుర్ నుంచి ఆరియాకు ఓ స్లీపర్ బస్సులో బయలుదేరింది. 
 
అయితే అర్థరాత్రి సాంకేతిక కారణంతో బస్సు నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులతో పాటు బాలిక కుటుంబం బస్సులో నుంచి కిందకు దిగింది. 15 ఏండ్ల బాలిక మాత్రం బస్సులోనే నిద్రిస్తోంది.. ఆ సమయంలో బస్ కండక్టర్ బబ్లూ సహాయకుడు అశు.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బస్సు ఎక్కిన బాలిక తల్లికి బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. అయితే అప్పటికే బయలుదేరగా బస్సును ఆపడానికి బాలిక తల్లి ప్రయత్నించింది. 
 
ఆ సమయంలో తనను కండక్టర్ బబ్లూ వెనక్కి లాగాడని బాలిక తల్లి తెలిపింది. మార్గమధ్యలో వారిద్దరూ వేర్వేరు చోట్ల దిగిపోయారని పేర్కొంది. మంగళవారం ఉదయం శికోహాబాద్ చేరుకున్న వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశును అరెస్టు చేశామని, బబ్లూను త్వరలోనే పట్టుకుం టామని చెప్పారు.