గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:08 IST)

కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి ... ఎక్కడ?

కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా కొందరు తండ్రులు తమ కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. కొందరు తల్లులు కుమార్తెలతో అత్యాచారాలు వంటి పాడు పనులు చేయిస్తున్నారు. తాజాగా ఓ తల్లి దగ్గరుండి మరీ తన కుమార్తెపై అత్యాచారం చేయించింది. ఈ దారుణం మహారాష్ట్రలోని భీవండి అనే ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓ యువతి శరీరంలోకి చనిపోయిన ఆమె మామయ్య ఆవహించాడని నమ్ముతూ వచ్చారు. ఈ సాగుతో ఆ యువతి తల్లి స్వయం ప్రకటిత దేవుడనే చెప్పుకునే ఓ వ్యక్తితో కుమార్తెపై అత్యాచారం చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. 
 
తన 16 ఏళ్ల తన కుమార్తెకు మామయ్య దెయ్యమై ఆవహించడం వల్ల తీవ్రమైన మెడనొప్పి ఉందని తల్లి భావించింది. దీన్ని నయం చేసేందుకు స్వయం ప్రకటిత దేవుడని చెప్పుకునే ఓ వ్యక్తి వద్దకు తీసుకెళ్లింది. 
 
దెయ్యాన్ని వదిలించి అనారోగ్యాన్ని దూరం చేస్తానని చెప్పి బాలికను అడవిలోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారం చేసిన వ్యక్తితోపాటు దానికి సహకరించిన తల్లిని కూడా అరెస్టు చేశారు.