శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:20 IST)

వృద్దురాలిపై టీనేజర్ లైంగికదాడి.. విఫలం కావడంతో ఆమెను చంపి మృతదేహంతో...

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఓ 60 యేళ్ల వృద్ధురాలు అత్యాచారయత్నం, హత్యకు గురైంది. ఆమెపై పక్కింటిలో ఉండే ఓ యువకుడు లైంగికదాడికి తెగబడ్డాడు. అయితే, తన ప్రయత్నం విఫలం కావడంతో ఆ వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంతో తన కామవాంఛ తీర్చుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రం హనుమాన్‌గఢ్‌లో ఉన్న పిలిబంగా పట్టణానికి చెందిన 19 ఏండ్ల కుర్రాడు.. తన ఇంటి పక్కనే ఉన్న ఓ 60 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేయబోయాడు. 
 
అయితే అది విఫలమవడంతో ఆమెను చంపి ఆ మృతదేహాన్ని అనుభవించాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఆ సమయంలో టీనేజర్‌ మద్యం మత్తులో ఉన్నాడని, వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమై హత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.