శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (16:06 IST)

చంచల్‌గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న తీవ్ర అస్వస్థత

ప్రముఖ జర్నలిస్టు, బుల్లితెర యాంకర్ తీన్మార్ మల్లన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అరెస్టు చంచల్‌గూడా జైల్‌లో ఉన్న తీన్మార్ మల్లన్న తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం అందుతోంది. 
 
ఆయన శనివారం రాత్రి నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన తీన్మార్ మల్లన్న‌ను ఆస్పత్రికి పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 
 
తీన్మార్ మల్లన్న బెయిల్ రిట్ పిటిషన్‌పై హైకోర్టులో శనివారం విచారణ జరిగింది. తీన్మార్ మల్లన్న భార్య మతమ్మ అ పిటిషన్‌ను దాఖలు చేశారు. మల్లన్న‌ను అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు నమోదు చేసిన 306 మరియు 511 సెక్షన్లు తొలగించాలని పిటిషనర్ కోరారు. 
 
కింది కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వలేమని తేల్చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇక ఈ కేసు సెప్టెంబరు 14కు వాయిదా పడింది.