టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఎంపికయ్యారు. కడప వేదికగా జరుగుతున్న ఆ పార్టీ జాతీయ మహానాడులో ఆయనను పార్టీ అధ్యక్షుడుగా పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్టు పార్టీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు.
కాగా, చంద్రబాబు నాయుడు తొలిసారి 1995లో టీడీపీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి గత మూడు దశాబ్దాలుగా ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షుడుగా ఉండగా, ఆ తర్వాత ఆయన జాతీయ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
చంద్రబాబుకు పార్టీపై ఉన్న పట్టుదల, ప్రజల సమస్యలపై ఆయన చేస్తున్న కృషి, నాయకత్వం నైపుణ్యం ఇలా అనేక అంశాలు ఆయనను మరోమారు అగ్రస్థానానికి చేర్చాయి. ఈ ఎన్నిక ద్వారా ఆయన నాయకత్వానికి పార్టీలో మద్దతు మరోమారు స్పష్టమైంది.