1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 మే 2025 (14:46 IST)

తప్పతాగి భీమవరం రోడ్డుపై అడ్డంగా పడుకున్న యువతి (video)

drunk woman bhimavaram
మద్యం సేవించడంలో కొన్నిచోట్ల మగవారిని మించిపోతున్నారు మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇలాంటి దృశ్యం ఒకటి కనబడింది. భీమవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పూటుగా మద్యం సేవించిన ఓ యువతి రోడ్డుకి అడ్డంగా పడుకున్నది. మద్యం మత్తు తలకెక్కడంతో అక్కడే పడిపోయింది. దాంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 
ఎవరు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఆ యువతి మాత్రం అంగుళం కూడా కదల్లేదు. దానితో వాహనదారులు తమ వాహనాలను ఆమెను తప్పించి ముందుకు సాగారు. సుమారు 20 నిమిషాల పాటు ఆ యువతి అలాగే రోడ్డుపై మత్తులో జోగుతూ అటుఇటూ దొర్లుతూ వున్నది. చివరికి పోలీసులు ఆమెను ఎలాగో అక్కడ నుంచి పక్కకు తీసుకుని వెళ్లారు.