1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 మే 2025 (09:09 IST)

ప్రయాణికుల హ్యాపీ... సాగరతీరం నుంచి ఎడారి తీరానికి విమాన సర్వీసులు...

flight
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విమాన ప్రయాణికులకు శుభవార్త. సాగరతీరం విశాఖపట్టణం నుంచి ఎడారితీరం అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ అందుబాటులో వచ్చింది. వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సర్వీసు వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 8.20 గంటలకు విమానం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 9.50 గంటలకు అబుదాబికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబికి ఇప్పటివరకు ప్రత్యక్ష విమాన సర్వీసులు లేకపోవడంతో రాష్ట్రంలోని అనేక మది ప్రయాణికులు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై వీరి కష్టాలు తీరిపోనున్నాయి.