రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?
అనేక మంది మహిళలు, యువతులకు రుతుక్రమ సమయంలో విపరీతమైన నొప్పులు వస్తుంటాయి. కొందరు మహిళలు ఈ నొప్పులు భరించలేకపోతున్నారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన వైద్యం చేసుకుంటారు.
అయితే, కొందరు గృహ వైద్య నిపుణులు మాత్రం ఈ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రుతుక్రమ నొప్పి తగ్గేందుకు నిమ్మరసం లేదా కాఫీని తాగమని కొందరు సలహా ఇస్తున్నారు.
అలాగే, నెలసరి సమయంలో వ్యాయామం చేయడం శరీరానికి హాని కలిగిస్తుందనే తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చూశామని పలువురు మహిళలు చెప్పారు. తేలికపాటి శారీరక శ్రమ వల్ల రుతుక్రమ నొప్పులు తగ్గుతాయనే శాస్త్రీయ భవనకు ఇది విరుద్ధమని వారు అభిప్రాయడతున్నారు. ఇలా పలు అంశాల్లో అపోహలు కలిగించే ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యలకు కోరున్నారు.