మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 28 ఏప్రియల్ 2025 (23:40 IST)

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

Dr Srinivasa Rao
విజయవాడ: సకాలంలో అత్యాధునిక సంరక్షణ అందించినప్పటికీ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు చాలా వేగంగా దిగజారుతాయి. వెంటిలేటర్‌పై ఉన్న ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడలేదనే మాటలు మనం వింటూ ఉంటాం. ఊపిరితిత్తులకు విశ్రాంతి అవసరమైనప్పుడు లేదా గుండె కోలుకునేందుకు సమయం అవసరమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి తీవ్రమైన సందర్భాల్లో ఒక ఆధునిక ప్రాణ రక్షణ వ్యవస్థ ఎక్మో (ECMO) ఒక శక్తిశాలి మిత్రుడిగా అండగా నిలుస్తుంది. రోగుల మనుగడకు గొప్ప అవకాశంగా నిలుస్తూ, వారి బంధువుల్లో ఆశ చిగురింపజేసే ఆ అత్యాధునిక సంక్లిష్ట సంరక్షణ ఇప్పుడు మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో అందుబాటులో ఉంది. ఎక్మో (ECMO) సేవలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచస్థాయి క్లిష్టమైన సంరక్షణను ప్రాంతీయ స్థాయిలో అందిస్తూ ఈ ఆస్పత్రి ఒక కీలక ముందడుగు వేసింది.
 
ఎక్మో (ECMO) అంటే ఏంటి?
సరళమైన మాటల్లో చెప్పాలంటే ఎక్మో(ECMO) (ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) ఒక కృత్రిమ గుండె-ఊపిరితిత్తుల మెషీన్‌. ఇది రోగి అవయవాల పనిని తాత్కాలికంగా నిర్వహిస్తుంది. తీవ్రమైన ఊపితిత్తులు సమస్య/లేదా హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగుల్లో ప్రామాణిక చికిత్సలైన వెంటిలేటర్లు లేదా ఔషధాలు పనిచేయని స్థితిలో ఇది ఒక ఆధునిక ప్రాణ రక్షణగా నిలుస్తుంది. గుండె, ఊపిరితిత్తులు విశ్రాంతిలో ఉండి కోలుకుంటున్న సమయంలో శరీరం నుంచి ఎక్మో(ECMO) రక్తాన్ని తీసుకొని దాన్ని ఆక్సిజనేట్‌(శుద్ధి) చేసి తిరిగి పంపిస్తుంది.
 
మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడ- ఐసీయూ, క్రిటికల్‌ కేర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్ రావు వైద్యపరంగా ఎక్మో(ECMO) సంకేతాలు నొక్కిచెప్తూ, “యాక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌(ARDS), తీవ్రమైన న్యూమోనియా, పల్మనరీ ఎంబోలిజం, కార్డియాక్‌ సర్జరీకి సంబంధించి తీవ్రమైన రోగుల్లో ఎక్మో (ECMO) ఒక ప్రాణరక్షణ జోక్యంగా నిలుస్తుందనే విషయం రుజువైంది. అంతేకాదు అవయవ మార్పిడికి ముందు అవయవాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిన నార్మోథర్మిక్‌ రీజినల్‌ పర్ఫ్యూషన్‌ సాంకేతిక పరిజ్ఞానంలోనూ ఎక్మో(ECMO) కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ఎదుగుతున్న ఈ రంగంలో అవయవ పరిరక్షణ, అత్యంత క్లిష్టమైన సంరక్షణ వంటి వివిధ ఎక్మో (ECMO) విధానాల ప్రయోజనాల సమ్మేళనంతో హైబ్రిడ్‌ ఎక్మో (ECMO)  ఒక ఆశాజనక ఆవిష్కరణగా నిలుస్తుందని” తెలిపారు.
 
ఎక్మో(ECMO) ఎలా పనిచేస్తుంది?
ఎక్మో (ECMO) పని చేసే విధానాన్ని మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడ క్రిటికల్‌ కేర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ వి.దినేష్‌ కుమార్‌ గొంట్ల వివరిస్తూ, “ఎక్మో(ECMO)లో ఆక్సిజనరేటర్‌, పంప్‌ అనే రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఆక్సిజనరేటర్‌ ఊపిరితిత్తుల్లో రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ నిర్వహిస్తుంది, పంప్‌ అనేది గుండెలా రక్తాన్ని పంపింగ్‌  చేస్తుంది. ఈ రెండు పనులతో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు లేదా గుండె ఆగిపోయిన సందర్భాల్లో కోలుకుంటున్న రోగుల్లో ఎక్మో అనేది (ECMO) ఒక రికవరీ వారధిగా, అత్యంత తీవ్రమైన శ్వాస సమస్యలు, కార్డియాక్‌ ఫెయిల్యూర్‌ ఉన్న రోగులు ఊపిరితిత్తులు లేదా గుండె మార్పిడి చేసుకునేందుకు ఒక మార్పిడి వారధిగా పనిచేస్తుంది” అని తెలిపారు.
 
ఎక్మో (ECMO) లో రెండు వేర్వేరు రకాలున్నాయి:
VV-ఎక్మో(వేనో-వినాస్‌ ఎక్మో) ఇది కేవలం ఊపిరితిత్తులకు మాత్రమే సపోర్టు అందిస్తుంది. గుండె బలంగా పనిచేస్తూ ఊపిరితిత్తులు విఫలమై తీవ్రమైన న్యూమోనియా, ARDS- యాక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ లేదా కొవిడ్‌-19 సంబంధిత సమస్యల్లో దీనిని ఉపయోగిస్తారు. ఇందులో పెద్ద సిర నుంచి మెషీన్‌ రక్తాన్ని తీసుకొని దాన్ని ఆక్సిజనేట్‌ చేసి తిరిగి సిరల వ్యవస్థలోకి పంపిస్తుంది. ఊపిరితిత్తులు ఇంకా కోలుకుంటున్న సమయంలో ఇది రోగి ఆక్సిజన్‌ స్థాయిలు తగిన రీతిలో ఉండేలా చూడటంలో సాయపడుతుంది.
 
VA ఎక్మో (వెనో-ఆర్టిరియల్‌ ఎక్మో)- ఇది గుండె, ఊపిరితిత్తులు రెండింటికి సపోర్టు చేస్తుంది. కార్డియాక్‌ అరెస్టు, తీవ్రమైన హార్ట్‌ అటాక్‌ లేదా తీవ్రమైన గుండె వైఫల్యం వంటి తీవ్రమైన పరిస్థితుల్లో గుండె, ఊపిరితిత్తులు విఫలమైన సమయంలో VA-ఎక్మో సిర నుంచి రక్తం తీసుకొని దాన్ని ఆక్సిజనేట్‌ చేసి పనిచేయని రెండు అవయవాలను దాటుకొని ఆక్సిజన్‌ అధికంగా ఉన్న రక్తాన్ని తిరిగి ధమనిలోకి పంపుతుంది. గుండె, ఊపిరితిత్తులకు కావాల్సిన విశ్రాంతి, కోలుకునేందుకు కావాల్సిన సమయాన్ని ఇచ్చి ప్రసరణ, ఆక్సిజనేషన్‌ను పునరుద్ధరిస్తుంది.
 
ఎక్మో(ECMO) (ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) గురించి సాధారణ మాటల్లో చెప్పాలంటే ఇది ఒక కృత్రిమైన గుండె- ఊపిరితిత్తుల మెషీన్‌. ఇది గుండె, ఊపిరితిత్తుల పనిని తాత్కాలికంగా నిర్వహిస్తుంది. దీని పని విధానం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. “ఎక్మో (ECMO) అనేది ఒక అత్యంత కచ్చితమైన విధానంతో పనిచేసే జోక్యం(మెషీన్‌). దీనికి విస్తృత నైపుణ్యం, అనుభవం కలిగిన బహుళ విభాగాల మధ్య సమన్వయం అవసరం. అందులో ఇవి కూడా ఉంటాయి:
 
సర్క్యూట్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసి ఎక్మో (ECMO) క్యాన్యూలేషన్‌ చేపట్టేందుకు కార్డియాక్‌ సర్జన్లు
రోగి తీవ్ర పరిస్థితిని పర్యవేక్షించేందుకు, మ్యానేజ్‌ చేసేందుకు ఇంటెన్సివిస్టులు
శ్వాస వ్యవస్థ నిర్వహణ, శ్వాసకోశ రికవరీ దిశానిర్దేశం చేసేందుకు పల్మనాలజిస్టులు
రోగి స్థిరంగా ఉండేలా చూసేందుకు కార్డియాలజిస్టులు
ఎక్మో (ECMO) మెషీన్‌ చూసేందుకు సాంకేతిక నైపుణ్యం కలిగిన పర్ఫ్యూషనిస్టులు
నిరంతరాయ సంరక్షణ అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఐసీయూ నర్సులు, టెక్నిషియన్లు
 
ఎక్మో (ECMO) సదుపాయానికి కావాల్సిన అత్యాధునిక మౌలిక సదుపాయలు, వివిధ విభాగాల మధ్య సమన్వయం మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఉంది. ఈ ప్రాంతంలో కీలక సంరక్షణ ప్రమాణాలు పెంచడంతో పాటు తీవ్ర అనారోగ్యం బారినపడ్డ రోగులకు కోలుకునే అవకాశం మాత్రమే కాదు, సాధ్యమైనంత ఉత్తమ అవకాశాన్ని అందించేందుకు ఆస్పత్రి కట్టుబడి ఉంది.