గురువారం, 31 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 30 జులై 2025 (15:31 IST)

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

Vijay Sethupathi, Nithya Menon, Pandiraj, B Nandini Reddy and others
Vijay Sethupathi, Nithya Menon, Pandiraj, B Nandini Reddy and others
విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటించిన రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రిలీజ్ అయింది.  ఆగస్ట్ 1న తెలుగులో రిలీజ్ కానుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.
 
చిత్రం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ, ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నేనెప్పుడూ హైదరాబాద్ వచ్చిన తెలుగు ప్రజలు ఎంతగానో ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు. తెలుగు పాటలు రాంబాబు చాలా చక్కగా రాశారు. వినసొంపుగా వున్నాయి. అందరూ రిలీట్ చేసుకునే కథ ఇది. ఈ సినిమా కోసం పరాటా చేయడం నేర్చుకున్నాను. రెండు నెలల కోర్స్ కూడా చేశాను. డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. నేను ఏ క్యారెక్టర్ చేసిన ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తూనే చేశాను. ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు ఈ కథని చాలా అద్భుతంగా రాశారు. చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాము. నిత్యతో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. మేము సినిమా గురించి, కథ గురించి. పాత్రల గురించి చాలా విషయాలు చర్చించుకుంటాము. ఈ సినిమా అంతా ఒక ఫ్యామిలీ ఎట్మాస్ఫియర్ లో జరిగింది. అందరూ థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'అన్నారు.
 
హీరోయిన్ నిత్యామీనన్ మాట్లాడుతూ, విజయ్ గారితో నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను.  అదొక డిఫరెంట్ సినిమా.  అందులో సైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. పాండిరాజ్ అద్భుతమైన డైరెక్టర్. ఈ కథ వినగానే ఓకే చేశాను.  ఇది ఒక హీరో హీరోయిన్స్ సినిమా కాదు ఒక ఫ్యామిలీ లాగా ఉండే సినిమా. ఆఫ్ స్క్రీన్ కూడా మేము అందరం ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. ఈ సినిమా కెమెరా వర్క్, మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి.  నేను నందిని ఇద్దరం కలిసి సినిమా చూసాము. చాలా ఎంజాయ్ చేసాము. తమిళ్లో సినిమా చాలా పెద్ద హిట్ అయింది. నెంబర్స్ తో పాటు అందరి మనసులో కూడా చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. తమిళ్ లాగే తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'అన్నారు.
 
డైరెక్టర్ పాండిరాజ్ మాట్లాడుతూ, సార్ మేడం అనేది భార్యాభర్తల మధ్య జరిగిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. విజయ్ సేతుపతి, నిత్య చాలా అద్భుతంగా నటించారు. లవ్ కామెడీ యాక్షన్ మాస్ ఎమోషన్స్ అన్ని ఉన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'అన్నారు.
 
డైరెక్టర్ బి నందిని రెడ్డి మాట్లాడుతూ, విజయ్, నిత్య ఇద్దరినీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు రెండు పాత్రలు గానే కనిపించాయి. ఒక మంచి హోమ్ ఫుడ్ లాంటి సినిమా ఇది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. ఈ మధ్యకాలంలో నేను చూసిన వెరీ క్యూట్ అండ్ హార్ట్ టచింగ్ మూవీ ఇది అన్నారు.