పీరియడ్స్ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్
మలయాళ నటి నిత్యా మీనన్ పేరు చెప్పగానే అలా మొదలైంది చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి, గీతగోవిందం చిత్రాల్లో నటించిన ఈ భామ ఇటీవల ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది.
సినీ ఇండస్ట్రీలో మహిళలు పడే ఇబ్బందులను కొందరు పట్టించుకోరని అంది. కొంతమంది దర్శకనిర్మాతలు తను పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నానని చెప్పినా... ఇతర నటీనటుల కాల్షీట్లు వేస్టవుతాయనీ, అందువల్ల ఎలాగోలా నటించమని ఒత్తిడి చేస్తారంటూ చెప్పుకొచ్చింది. ఐతే కొంతమంది దర్శకనిర్మాతలు మాత్రం మహిళలకు సంబంధించిన సమస్యలు చెప్పగానే వెంటనే షెడ్యూల్ క్యాన్సిల్ చేసి తారల కష్టాలను పట్టించుకుంటారంటూ వెల్లడించింది.