కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ షాక్ : ఎమర్జెన్సీ మూవీపై నిషేధం!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బంగ్లాదేశ్ పాలకులు షాకివ్వనున్నారు. ఆమె ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ నెల 17వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ఒక్క భారత్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ చిత్రం విడుదల కాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించాలన్న తలంపులో ఉంది.
ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో కంగనా రనౌత్ నిర్మించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందిరాగాంధీ పాత్రను కంగన పోషించగా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో శ్రేయస్ తల్పాడే కనిపించనున్నారు.
మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలనే యోచనలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత... భారత్ - బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఎమర్జెన్సీ' మూవీని బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది.