ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జనవరి 2025 (17:57 IST)

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

Covid
చైనాలో మరోసారి covid 19 పంజా విసిరినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మానవ మెటాప్‌న్యూమోవైరస్‌తో సహా చైనాలో వైరల్ వ్యాప్తికి సంబంధించిన నివేదికల ద్వారా అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, WHO కొత్త కరోనావైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం పాలవగా చైనాలో మాత్రమే 170 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలన్నీ చైనాలోనే చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
 
సైంటిస్ట్ ఆర్గ్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో కొత్త కరోనావైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ జెనీవా విలేకరుల సమావేశంలో ఈ వార్తలను ప్రకటించారు. డిసెంబర్ 31, 2019న చైనాలో మొదటిసారిగా కరోనా వైరస్ బైటపడినప్పటికీ, కొత్త వైరస్ 18 వేర్వేరు దేశాలలో 7,834 మందికి సోకింది. చైనాలో 170 మంది మరణించారు.