గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (20:28 IST)

మంకీ పాక్స్.. కరోనా వంటిది కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ

monkey fox
మంకీ పాక్స్ ఆఫ్రికా దాటి పలు దేశాలకు విస్తరిస్తోంది. కరోనా తర్వాత, మళ్లీ ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లోనూ కొన్ని నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 99,176 కేసులు నమోదు కాగా, కాంగోలో వేగంగా వ్యాపిస్తోంది. 
 
మన దేశంలో 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. మార్చి 2024లో కేంద్ర ప్రభుత్వం చివరి కేసును గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ప్రకటన అందరికీ స్వల్ప ఊరటనిస్తోంది. 
 
ఇది కరోనా వంటిది కాదని, మంకీ పాక్స్‌ను నియంత్రించవచ్చని వెల్లడించింది. మంకీ పాక్స్ వ్యాప్తి నియంత్రణకు, నిర్మూలనకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిని కలిసి కట్టుగా ఎదుర్కోవాలన్నారు. దీనిని నిర్మూలించడం, నియంత్రించడం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ చెప్పారు.