ది రైజ్ ఆఫ్ అశోక నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఏదో ఏదో’ సాంగ్ విడుదల
లూసియా ఫేమ్ సతీష్ నినాసం హీరోగా, నిర్మాతగా భారీ ఎత్తున రూపొందిస్తున్న చిత్రం ది రైజ్ ఆఫ్ అశోక. ఈ సినిమాని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి వినోద్ వి ధోండలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సతీష్ నినాసంకి జోడిగా కాంతార, తమ్ముడు ఫేమ్ సప్తమి గౌడ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, తాజాగా రిలీజ్ చేసిన పవర్ ఫుల్ సాంగ్ వినరా మాదేవ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ప్రేమ జంటను కట్టి పడేసేందుకు ఓ మంచి రొమాంటిక్ మెలోడీతో టీం ముందుకు వచ్చింది. తాజాగా ది రైజ్ ఆఫ్ అశోక నుంచి ఏదో ఏదో అంటూ సాగే యుగళ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటను వింటే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వారి అనుబంధం, కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అర్థం అవుతోంది. ఇక వీడియో సాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేయడంతో.. పాటలోని అందమైన లొకేషన్లు, హీరో హీరోయిన్ల పాత్ర తీరు మొత్తాన్ని చూపించినట్టు అయింది. ఇందులో సతీష్, సప్తమీ గౌడ జంట చూడముచ్చటగా ఉంది. ఈ పాటకు తగ్గట్టుగా వారి స్టెప్పులు, లుక్స్ అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి.
ఏదో ఏదో అనే ఈ పాటను జయచంద్ర జె.డి. రచించారు. సాయి చరణ్, ఎం.డి. పల్లవి గాత్రం ఈ పాటను గుండెకు హత్తుకునేలా చేసింది. పూర్ణచంద్ర తేజస్వీ ఇచ్చిన బాణీ అయితే ఎంతో వినసొంపుగా ఉంది. సంతు మాస్టర్ కొరియోగ్రఫీ ఎంతో సింపుల్‌గా, చాలా ఎఫెక్టివ్‌గా కనిపిస్తోంది. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం : సతీష్ నినాసం, సప్తమి గౌడ, బి.సురేష్, సంపత్, మైత్రేయ, గోపాల్ కృష్ణ దేశపాండే, యష్ శెట్టి, జగప్ప, రవిశంకర్ (ఆర్ముగ), డ్రాగన్ మంజు తదితరులు