మంచి మాటలు చెప్పే ఉద్దేశ్యంతో అసభ్య పదాలు వాడాను : శివాజీ (వీడియో)
దండోరా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళల వస్త్రాధారణపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో హీరో శివాజీ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశ్యంతో రెండు అసభ్య పదాలను ఉపయోగించానని పేర్కొన్నారు. పైగా, మహిళలందరినీ ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఆయన క్షమాపణలు చెపుతూ ఒక వీడియోను విడుదల చేశారు. మంచి విషయాలు చెప్పే క్రమంలో రెండు అసభ్య పదాలను వాడినందుకు ఎవరి మనోభావాలైనా దెబ్బనివుంటే క్షమించాలని కోరారు. తాను ఎవరినీ అవమానించే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదని ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
మంచి మాటలు చెబుతూనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని అంగీకరించారు. తాను గ్రా భాషలో మాట్లాడానని, అది తప్పేనని పేర్కొన్నారు. అలాంటి పదాలు వాడకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో స్త్రీని తక్కువగా చూపిస్తున్నారన్నారు. మహిళలను ఎవరు తక్కువగా చూడకూడదనే ఉద్దేశంతో తాను అలా మాట్లాడానని తెలిపారు. హీరోయిన్లు దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది వారికే మంచిదని శివాజీ సూచించారు.