గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (08:37 IST)

వెస్ట్ బెంగాల్ ఆర్థిక మాజీ మంత్రి కరోనా పాజిటివ్!

corona visus
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు ఒకటి వెలుగు చూసింది. ఆ రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి అమిత్ మిత్రాకు ఈ వైరస్ సోకింది. సోమవారం ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయనను ఐసోలేటెడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
దీనిపై బెంగాల్ ప్రభుత్వ వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, కరోనా కారణంగా మాజీ మంత్రి మిత్ర సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. 
 
కాగా, గత 2019 డిసెంబరులో వెలుగు చూసిన ఈ కరోనా వైరస్ అనేక ప్రపంచ దేశాల్లో మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. మన దేశంలో కూడా విలయతాండవం చేసింది. దీంతో లాక్డౌన్‌ను అమలు చేశారు. ఈ వైరస్ 2020లో సద్దుమణిగినప్పటికీ ఆ తర్వాత రెండు, మూడు దశలుగా వ్యాపించి, గత యేడాది కాలంగా శాంతించింది. ఇపుడు మళ్ళీ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.