సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మే 2024 (16:15 IST)

కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు.. బ్రిటన్ శాస్త్రవేత్త

corona visus
కరోనా తరహా మరో సంక్షోభం తప్పదని.. బ్రిటన్ శాస్త్రవేత్త మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ దిశగా కీలక అంశాలపై తక్షణం దృష్టి పెట్టాలన్నారు. 
 
రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. 
 
తగిన స్థాయిలో వైద్య పరీక్షల నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్నీ అందుబాటులో ఉంటే లాక్ డౌన్, భౌతిక దూరం వంటి కఠిన చర్యల అవసరం ఉండదని చెప్పారు.
 
2021లో కరోనా సందర్భంగా తాను చేసిన సూచనలన్నీ 2023 కల్లా అనేక దేశాల ప్రభుత్వాలు మర్చిపోయాయన్నారు. ఇది ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు