Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?
తామర పువ్వు వేర్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. లోటస్ రూట్‌ను వంటలలో వివిధ రూపాల్లో ఉపయోగించవచ్చు. దీనిని సూప్‌లు, సలాడ్‌లు లేదా చిప్స్‌గా తయారు చేసుకోవచ్చు. దీనిని తాజాగా లేదా ఉడికించి కూడా తినవచ్చు. ఇది రుచికరమైనది. మంచి పోషకాలను అందిస్తుంది.
ఇది విటమిన్ సికి అద్భుతమైన మూలం. అంతే కాదు, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీని యాంటీఆక్సిడెంట్ శక్తి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇది క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఈ వేరులో పొటాషియం, ఇనుము ఖనిజాలు కూడా ఉన్నాయి.
ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వేరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయం ఆకలిని నియంత్రిస్తాయి.
మీరు ఉపయోగించడానికి సిద్ధంగా ఉండే వరకు తామర వేర్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. తామర వేర్లను కోసేందుకు ముందు తర్వాత చేతులను శుభ్రంగా వుంచుకోండి. తామర వేర్లను ఉడికించే ముందు వెనిగర్ లేదా నిమ్మరసంలో శుభ్రం చేసుకోండి. తద్వారా అవి గోధుమ రంగులోకి మారకుండా ఉంటాయి. ఉడికిన తర్వాత, తామర వేర్లను ఎక్కువ రోజులు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తినకుండా త్వరగా ఖాళీ చేయండి