శనివారం, 8 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2025 (18:37 IST)

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Shruti Haasan, Kamal Haasan
Shruti Haasan, Kamal Haasan
శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఒక  ఎమోషనల్  పోస్ట్ ను షేర్  చేసింది. నాకు ఇష్టమైన వ్యక్తి, అద్భుతమైన నాన్న అని పేర్కొంటూ, ఒక అందమైన వీడియోను పంచుకుంది హీరోయిన్. అద్భుతమైన నాన్నకు..శ్రుతి హాసన్ పోస్ట్ లో ఏముందంటే.. "నాకు ఇష్టమైన వ్యక్తి, అద్భుతమైన నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మ్యాజిక్, ప్రకాశానికి ఏదీ సాటిరాదు. మీరు కలలు కంటూనే ఉండాలి' అని శ్రుతి హాసన్ తన తండ్రికి విషెష్ చెప్పింది.
 
సినీ కెరీర్ - వ్యక్తిగత కెరీర్ - పాలిటిక్స్ 
కమల్ హాసన్ గురించి రచయిత డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్ ఇలా చెబున్నారంటే.. అసలు కమల్ హాసన్ అంటే ఎందుకనో తెలుగు వారికి పడడం లేదు. కమల్ నటన వరకే చూడండి. ఎన్ని వైవిధ్య మైన పాత్రలను పోషించాడో తెరమీద. కానీ మతం గురించి రాజకీయాల గురించి ఆయన వేసిన స్టెప్ లు కొందరికి నిరాశపరిచాయి.
 
హేతువాది అనా! సనాతన ధర్మం అనే ముసుగును విమర్శించాడనా! పర్సనల్ లైఫ్ లో మంచి భర్త గా...మంచి తండ్రిగా లేడనా! సహజీవనాలు చేస్తున్నాడనా! ఉమనైజర్ అనా! పాలిటిక్స్ లో ప్రవేశించాడనా! ఇవన్నీ అతని పర్సనల్ వ్యవహారాలు కదా! వాటిని మనమెందుకు పట్టించుకోవాలసలు!? అయినా కమల్ వేసినన్ని వైవిధ్య భరితమైన వేషాలు...తెలుగు -తమిళ తెరమీద ఇంతవరకు ఏ నటుడు ధరించి మెప్పించి ఉండరు.
 
ఆయన చేసిన సినిమాల గురించి చెప్పాలంటే..  పదహారేళ్ళ వయస్సు, సాగర సంగమం, స్వాతి ముత్యం, అమావాస్య చంద్రుడు, నాయకుడు, భారతీయుడు, వసంత కోకిల, ఇంద్రుడు -చంద్రుడు, బ్రహ్మచారి, భామనే సత్య భామనే, పుష్పక్, ఆకలి రాజ్యం, మేఖేల్ మదన కామరాజు, క్షత్రియ పుత్రుడు, విక్రం. ఇవన్నీ ఒక ఎత్తైతే....దశావతారం లో పది పాత్రలు పోషించి మెప్పించడం...ఏ నటుడూ ఇంతవరకూ ప్రపంచ చరిత్ర లోనే చేసి ఉండరు.
 
అవార్డుల పరంగా చూస్తే, ఉత్తమ నటుడుగా 3 జాతీయ అవార్డులు అందుకున్న నటుడే లేడు ఇప్పటి వరకు  ఇండియాలో. అలాగే 18 సార్లు ఉత్తమ నటుడి గా ఫిల్మ్ఫేర్అవార్డులు కొట్టిననటుడూ లేడు. ఈ పాత్రలన్నీ పోషించగల సామర్ధ్యం...
ఇప్పుడున్న నటులకుందంటారా!? పోల్చడం కాదు గానీ...భారతీయుడు లా ఒక్క మగాడు తీశారు బాలకృష్ణ తో. ఎంత చెత్తగా ఉందో కమల్ నటించిన భారతీయుడు -2.....అసలు సిసలు చెత్త. అది వేరే విషయం.
 
ఓ వయసొచ్చాక...ఇంకా స్టెప్పులెయ్యాలంటే కుదరదు. అందుకే పాలిటిక్స్ లో కెళ్ళాడు. అయితే వ్యక్తిగతంగా ఆయనను పరిశీలిస్తే.. కొందరు ఆయన్ను వ్యతిరేకిస్తారనే మాట నిజం. వాణీ గణపతి(మొదటి భార్య) శ్రీవిద్య(ప్రేమికురాలు ) సారిక( రెండవ భార్య) గౌతమి(సహ జీవనం) సిమ్రాన్(ప్రేమికురాలు) పూజా కుమార్(సహజీవనం) ఈ విషయాలతో ఆయన పాలిటిక్స్ తో ముందుకు సాగలేకపోయాడనేది విశ్లేషకుల అంచనా. మక్కల్ నీది మయ్యం( ఎం.ఎన్.ఎం.) పార్టీ పెట్టి...డి.ఎం.కె. & ఎ.డి.ఎం.కె. లను తూర్పార  పట్టారు.  తమిళులు కదా....ఏది నటనో...ఏది జీవితమో...అవగాహన ఉన్నట్లుంది. వినిపించుకోలేదు.  స్టాలిన్ కే పట్టం కట్టారు.