ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మే 2024 (15:59 IST)

కేరళ రైలులో వైద్యురాలిని కాటేసిన పాము.. ఆమెకు ఏమైందంటే?

Snake
మంగళవారం కేరళలోని నిలంబూరు నుంచి షోర్నూర్ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో 25 ఏళ్ల మహిళ పాము కాటుకు గురైంది. ఆయుర్వేద వైద్యురాలు గాయత్రి అనే ప్రయాణికురాలు వల్లపుజ స్టేషన్‌లో రైలు దిగింది. అక్కడే పాముకాటు వేయడంతో గాయత్రి స్టేషన్‌లోని వ్యక్తులను సహాయం కోరింది. వారి సాయంతో ఆసుపత్రికి తరలించారు. 
 
రైలులోని ప్రయాణికులు సీటు కింద పామును గుర్తించినట్లు తెలిపారు. వల్లపుజా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడంతో, ఆమెను పెరింతల్‌మన్నలోని మరో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పుడు ఆమె వైద్యుల పరిశీలనలో ఉన్నారు. రైలు షోర్నూర్‌కు చేరుకోగానే రైల్వే అధికారులు తనిఖీలు చేయగా ఆ పాము కనిపించలేదు.