గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మే 2024 (17:52 IST)

కేరళలో గూగుల్ మ్యాప్ ఎంత పనిచేసింది.. చెరువులో పడిన కారు

pond
హైదరాబాద్‌కు చెందిన నలుగురు పర్యాటకులు కారులో మున్నార్ నుంచి అలప్పుజకు వెళుతున్నారు. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో వారి కారు కురుప్పంతర పీర్ బ్రిడ్జి ప్రాంతంలో నీటి ప్రవాహంలో పడిపోయింది. 
 
అయితే గూగుల్ మ్యాప్స్ సాంకేతిక కారణాలతో వారికి అలప్పుజకు బదులు నీటి ప్రవాహంలోకి దారి చూపించిందని.. అది రాత్రిపూట కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. కారు నీటిలో మునిగిపోవడాన్ని స్థానికులు గమనించారు. 
 
స్థానికుల సహాయంతో పోలీస్ పెట్రోలింగ్ యూనిట్, వారిని సురక్షితంగా కాపాడారు. ఈ కారులో ఓ మహిళ సహా నలుగురు ఉన్నారు. ఆ తర్వాత కారును బయటకు తీశారు.