ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్
జట్టు రాలిపోవడం, పలచబడిపోవడం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలా జుట్టు రాలకుండా పెరుగుదలకు వాల్‌నట్స్ ఎంతో ఉపయోగపడుతాయి. ఈ వాల్‌నట్స్ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
వాల్‌నట్‌లను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
వాల్‌నట్‌తో చుండ్రు, దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.
వీటిని ఉపయోగించడం ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
వాల్‌నట్ తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది.
జుట్టు పెరుగుదలకు ప్రతిరోజూ 4 వాల్‌నట్‌లను తీసుకోండి.
వాల్‌నట్ పేస్టును తేనె, కలబందతో కలిపి తలకు అప్లై చేయడం వల్ల కుదుళ్లు గట్టిపడతాయి.
పెరుగులో వాల్‌నట్ పౌడర్ కలిపి అప్లై చేయడం వల్ల మేలు జరుగుతుంది.
ఈ చిట్కాలను ఉపయోగించే ముందు ఆరోగ్యనిపుణుడిని సంప్రదించండి