ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (10:47 IST)

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

Hepatitis A
Hepatitis A
కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ బారిన పడుతారు. కేరళలో హెపటైటిస్ ఏ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హెపటైటిస్ ఏతో బారిన పడి మృతి చెందారు. ఇప్పటికే దీనిబారిన పడిన వారి సంఖ్య రెండువేలకు పైగా దాటింది. 
 
కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందే హెపటైటిస్ ఏ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో మార్గదర్శకాలు విడుదల చేసింది ఆరోగ్య శాఖ. ఈ వైరస్ కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే కామెర్లకు దారితీస్తుంది. 
 
ఇన్ ఫెక్షన్ ముదిరి కాలేయ వైఫల్యానికి కారణమవుతుందని వైద్యులు చెప్తున్నారు. హెపటైటిస్ ఏ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారికి కూడా వ్యాధి సోకుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 
 
ఈ వ్యాధి సోకిన వ్యక్తితో శారీరక సంబంధం ద్వారా హెపటైటిస్ ఏ వచ్చే అవకాశం ఎక్కువన్నారు. హెపటైటిస్ ఏ బాధితులలో అలసట, వికారం, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు.