మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (14:02 IST)

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

arrest
కిడ్నీలు దానం చేస్తే పరిహారం ఇపిస్తానని నమ్మించి అనేక మందిని తన వెంట తీసుకుని అక్రమంగా విక్రయిస్తున్న ఓ కిరాతకుడిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. హ్యూమన్ ఆర్గాన్ హార్వెస్టింగ్ పేరుతో సాగిన ఈ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో ఈ వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 30 యేళ్ల వ్యక్తిని కేరళ పోలీసులు త్రిశూర్‌లో ఆదివారం అరెస్టు చేశారు. 
 
త్రిశూర్ జిల్లాలోని వలప్పాడుకు చెందిన సబిత్ నాస్సర్ అనే వ్యక్తిని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, అక్రమ మార్గంలో డబ్బును సంపాదించేందుకు విదేశాల్లో కిడ్నీదానం చేస్తే న్యాయబద్ధమైన పరిహారం అందజేస్తానని అనేక మంది బాధితులను నమ్మించి, వారిని అక్రమ రవాణా చేస్తూ వచ్చాడు. దీంతో అతనిపై ఒక వ్యక్తి అక్రమ రవాణా, మానవ అవయవాల మార్పిడి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతని వద్ద పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.