Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త
tomato virus
పాఠశాల యాజమాన్యాలు కూడా ఈ వైరస్ సోకిన పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని సూచిస్తున్నాయి. ఈ వైరస్ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల నుంచి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపారు. లాలాజలం లాంటి శరీర స్రావాలతో కూడా సోకుతుందని తెలిపారు.
ఈ వైరస్ వచ్చిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయన్నారు. చిన్నారులు సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఈ వైరస్ వ్యాపిస్తుందని వెల్లడించారు.
లక్షణాలు..
దురద, మంట, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
