సంబంధిత వార్తలు
- Husband Wife: భార్యాభర్తలు.. కష్టసుఖాలు.. ఎలా పంచుకోవాలి?
- భర్త మరో స్త్రీతో ఎఫైర్: కాల్ రికార్డ్, లొకేషన్ తెలుసుకునే హక్కు భార్యకు వుందన్న హైకోర్టు
- భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు, ఆ తర్వాత?
- మాదన్నపేటలో వృద్ధురాలిపై దాడి చేయించిన కానిస్టేబుల్
- ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య.. ఎక్కడ?
Wife: భర్త వేధింపులు.. తాగొచ్చాడు.. అంతే కర్రతో కొట్టి చంపేసిన భార్య
భర్త వేధింపులు భరించలేక భార్య కర్రతో కొట్టి హతమార్చింది. తాజాగా మేడ్చల్ పట్టణంలో జరిగిన మరో ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాగొచ్చిన భర్త వేధింపులను తట్టుకోలేక భార్య భర్తను కడతేర్చింది. మేడ్చల్ పట్టణం, ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్ (45), సావిత్రి దంపతులు నివసిస్తున్నారు.
శ్రీనివాస్ భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో అతడు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి భార్య సావిత్రిని వేధింపులకు గురిచేశాడు. కానీ అతనిలో మార్పు రాలేదు. బుధవారం మరోసారి అతడు తన భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె భరించలేక అతడిని హతమార్చింది. క్షణకావేశంలో కర్రతో అతడిపై దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యకు భార్యే కారణమని అంగీకరించింది. దీంతో నిందితురాలు సావిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
