1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 11 జులై 2025 (17:44 IST)

వంటమనిషి గన్ పడితే.. కథతో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ ల సార్‌ మేడమ్‌

Vijay Sethupathi, Nithya Menon,
Vijay Sethupathi, Nithya Menon,
వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.  
 
తాజాగా మేకర్స్ ‘సార్‌ మేడమ్‌’ టైటిల్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌ పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలై.. భార్యభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో ఆకట్టుకుంది. విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్ మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకుల్ని అలరించాయి.
 
టీజర్‌ ప్రారంభంలో వంట మాస్టర్‌లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని మాస్‌ యాక్షన్‌ లుక్‌ కనిపించడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
 
టీజర్ విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది. డైరెక్టర్ పాండిరాజ్‌ ఫ్యామిలీ జానర్ లో ఒక యూనిక్ స్టొరీతో వస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టైటిల్ టీజర్ కి సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
ఈ చిత్రంలో యోగి బాబు, RK సురేష్, చెంబన్ వినోద్ జోస్, శర్వణన్, దీప ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ నెల 25న థియేటర్లో విడుదల కానుంది.
 
ఈ చిత్రానికి డిఓపి ఎం సుకుమార్, ఎడిటర్ ప్రదీప్ ఇ రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్ వీర సమర్.