విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు
నవీ ముంబై నగరంలో ఓ మహిళా టీచర్ జైలుకెళ్లింది. తన వద్ద చదువుకునే విద్యార్థికి సెమీ న్యూడ్‌గా వీడియో కాల్స్ చేయడంతో ఆమె జైలుపాలైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 35 యేళ్ల మహిళా టీచర్.. పాఠశాలలోని ఓ మైనర్ విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించింది. ఇన్‌స్టా సహా ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అసభ్యకర సందేశాలు పంపేది. చివరికి సెమీ న్యూడ్ కాల్స్ కూడా చేసేది. దీంతో ఈ విషయాన్ని బాలుడు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.
ఆ టీచర్ ప్రవర్తన తమ కుమారుడి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించినట్టు తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ టీచర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆమె ఇతర విద్యార్థులతో కూడా ఇలాగే ప్రవర్తించిందా అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. టీచర్ ఫోన్‌ను స్వాధీనం చేసున్న పోలీసులు దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఆమె ఉపయోగించే సోషల్ మీడియా ఖాతాలను కూడా తనిఖీ చేస్తున్నారు.
ఇటీవల ముంబైలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై ఓ మహిళా టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెల్సిందే. విద్యార్థిని పలు ఫైవ్‌స్టార్ హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక దాడికి చేసింది. దీంతో ఆమె పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.