శుక్రవారం, 1 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 జులై 2025 (13:23 IST)

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లా అమ్మోహాలో ఇటీవల ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలైన వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్ళిన ఓ యువకుడు గ్రామస్థుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అయితే, గ్రామంలో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న విషయాన్ని గ్రామస్థులు తెలుసుకున్నారు. ఈ ముగ్గురూ అనుమానాస్పదంగా తిరుతుండటాన్ని గస్తీ కాస్తున్న గ్రామస్తులు చాటుగా ఉండి గమనించారు. అప్పటికే ప్రియురాలి ఇంటిని సమీపించిన యువకుడిపై గ్రామస్తులు ఒక్కసారిగా దాడి చేశారు. 
 
ఇది గమనించి అక్కడి కొద్ది దూరంలో ఉన్న యువకుడి స్నేహితులు పారిపోయారు. చేతికి చిక్కిన యువకుడిని అర్ధరాత్రి ఎందుకు వచ్చావని నిలదీయగా ప్రియురాలి విషయం బయటపడకుండా ఉండేందుకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.
 
దాంతో అతడు ఖచ్చితంగా దొంగేనని నిర్ధారించుకున్న గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైనశైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. అతడు దొంగ కాదని నిర్ధారించుకున్న తర్వాత మరోసారి అర్థరాత్రిపూట ఆ గ్రామంలోకి వెళ్లనని సదరు యువకుడితో హామీ రాయించుకుని విడిచిపెట్టారు. ఈ ఘటన కాస్త బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.