ఆదివారం, 3 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 జులై 2025 (17:21 IST)

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

Kesar milk
Kesar milk
చిన్నాపెద్దా లేకుండా కుంకుమ పువ్వు పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కుంకుమపువ్వు తీసుకోవటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది విడుదల చేసే సెరోటినిన్ అనే పదార్ధం మనస్సును ప్రశాంతంగా ఉంచటం లో దోహదం చేస్తుంది. కుంకుమ పువ్వు పాలలో వుండే పోషకాలు పిల్లల్లో మెదడు తీరును మెరుగుపరుస్తుంది. ఇంకా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 
 
కుంకుమ పువ్వు కలిపిన పాలను కేవలం గర్భిణీలే కాదు, ఎవరైనా తాగొచ్చు. కుంకుమ పువ్వులో కేలరీలతో పాటు ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం పూట పాలలో కుంకుమ పువ్వును వేసుకొని తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 
 
సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. వాస్తవానికి కుంకుమ పువ్వును గర్భందాల్చిన సమయంలో తినటం వల్ల పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడుతుందన్న గ్యారేంటీ ఏమీ లేదు. అయితే ఇందులో ఉండే పోషక విలువలు మాత్రం బిడ్డ ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలిగిస్తాయని వైద్యులు చెప్తున్నారు. 
 
గర్భిణీల్లో కండరాల నొప్పులను తగ్గించటంతో పాటు జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తుంది. అయితే దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు కూడా రోజు ఒక చిటికెడు కుంకుమ పువ్వును పాలతో కలిపి ఇవ్వడం ఎంతగానో మేలు చేస్తుంది.