సంబంధిత వార్తలు
- లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం
- Woman killed husband: భర్తను గోడకేసి కొట్టి ఆపై గొంతు నులిమి హత్య చేసిన భార్య
- ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)
- Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు
- ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...
కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?
ఆహార పదార్థాలలో కల్తీ అనేది ప్రస్తుతం మామూలైపోయింది. తాజాగా కల్తీ పాల రాకెట్‌ను రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) అధికారులు చేధించారు. భువనగిరిలోని రెండు యూనిట్లపై రెండు వేర్వేరు దాడులు నిర్వహించిన తర్వాత కల్తీ పాల రాకెట్‌ను ఛేదించారు.
పాలను హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ చేసి ఎల్‌బి నగర్, ఉప్పల్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌లోని స్వీట్ షాపులకు విక్రయించారని భువనగిరి ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్ డి. ప్రవీణ్ బాబు గురువారం తెలిపారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ చేసిన పాలను అమ్మిన ఆరోపణలపై సామల సత్తి రెడ్డి, కె. రఘు పట్టుబడ్డారని వెల్లడించారు.
నిందితులు పాలపొడిని కొనుగోలు చేస్తున్నారని, ఆపై హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన పాలను తయారు చేస్తున్నారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితులు గత కొన్ని నెలలుగా పాలను కల్తీ చేస్తున్నారని సమాచారం ఆధారంగా, పోలీసులు పూర్వ నల్గొండ జిల్లాలోని మన్నెవారిపంపు గ్రామం, కనుముక్కల గ్రామంలోని రెండు యూనిట్లపై దాడి చేశారు.
మొత్తం మీద, దాడుల సమయంలో పోలీసులు 180 లీటర్ల కల్తీ పాలు, 700 మి.లీ హైడ్రోజన్ పెరాక్సైడ్, 12 పాలపొడి సాచెట్లు, 400 మి.లీ ఎసిటిక్ యాసిడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోచంపల్లి పోలీసులకు అప్పగించారు.
