మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (15:03 IST)

ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...

road accident
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ టీచరమ్మ తలపై లారీ ఒకటి దూసుకెళ్లింది. దీంతో ఆమె తల నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం జిల్లాలోని అడ్డగూడూర్ మండల పరిధిలోని చౌళ్ల రామారం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. బొడ్డుగూడెం టోల్ గేట్ వద్ద లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందారు. 
 
మృతురాలిని జబీనాగా గుర్తించారు. మోత్కూర్ మండలంలోని దాచారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచరుగా పనిచేస్తున్నారు. ఆమె స్కూటీపై వెళుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె కిందపడిపోవడంతో లారీచక్రాలు ఆమె తలపై నుంచి వెళ్ళాయి. దీంతో తల నుజ్జునుజ్జు అయిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.