అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ నీళ్లను తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, చక్కెర వ్యాధితో బాధపడేవారు, అలెర్జీలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
నిజానికి ఆయుర్వేదం వంటి సాంప్రదాయ ఆరోగ్యం విధానాల ప్రకారం, కొబ్బరి నీరు శరారాన్ని చల్లబరిచే లక్షణ కలిగి ఉంటుంది. వేసవిలో లేదా వేడి వాతావరణంలో ఇది ఉపయోగకరంగా ఉన్నప్పటికీ జలుబు, దగ్గు లేదా ఫ్లూ ఉన్నపుడు దీనిని తీసుకోవడం వల్ల లక్షణాలు మరింత తీవ్రం కావొచ్చు లేదా కోలుకోవడం ఆస్యం కావొచ్చు. తరచూ జలుబు బారినపడేవారు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు శీతాకాలంలో లేదా అనారోగ్య సమయంలో కొబ్బరి నీటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.