సంబంధిత వార్తలు
- గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)
- మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన
- వియత్నాం తీరంలో విషాదం - పడవ బోల్తాపడి 34 మంది దుర్మరణం
- ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం
- జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్
రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం
రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కుప్పకూలిపోయిన ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రయాణికులతో వెళుతున్న విమానం ఒకటి అమూర్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. తొలుత ఈ విమానం అదృశ్యమైనట్టు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు.
అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్-24 రకం విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్ చెన్స్క్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. ఇది మరికొద్దిసేపట్లో ల్యాండ్ కావాల్సివుండగా, ఉన్నట్టుండి ట్రాఫిక్ కంట్రోల్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను సిద్ధం చేసి విమానం కోసం గాలించగా, గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్టు గుర్తించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ విమానం తొలుత ల్యాండింగ్‌కు యత్నించగా రాడార్ నుంచి గల్లంతై కూలినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు రష్యాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటివరకు 49 మంది చనిపోయారు.
