శుక్రవారం, 18 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జులై 2025 (09:00 IST)

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

road accident
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆదిభట్ల వద్ద ఆగివున్న లారీని అమిత వేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు తీవ్రంగా గాయపడగా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
మృతులను కావలి బాలరాజు, గుగులోత్ జనార్థన్, మాలోత్ చందులాల్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడుని అతికష్టంమీద కారులోని బయటకు తీసి తరలించారు. ప్రస్తుంత అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.