1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వియత్నాం తీరంలో విషాదం - పడవ బోల్తాపడి 34 మంది దుర్మరణం

tourist boat capsizes
వియత్నాం తీరంలో విషాదకర ఘటన జరిగింది. కొందరు ప్రయాణికులతో వెళుతున్న పడవ ప్రతికూల పరిస్థితుల కారణంగా సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 34 మంది జలసమాధి అయ్యారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు తక్షణం రంగంలోకి దిగి 11 మందిని రక్షించాయి. పర్యాటకుల్లో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. 
 
వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో హా లాంగ్ బే ఒకటి. ఇక్కడకు 48 మంది పర్యాటకలు ఐదుగురు సిబ్బందితో ఓ పడవ బయలుదేరింది. అయితే, ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీయడంతో పడవ అదుపుతప్పి బోల్తాపడింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి పలువురుని రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది.