సంబంధిత వార్తలు
- కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి
- రాచరికం నుంచి జోరుపెంచే ‘టిక్కు టిక్కు’ పాటతో అలరించిన అప్సరా రాణి
- రోహిత్ వర్మ, రియా సుమన్ జంటగా నూతన చిత్రం ప్రారంభం
- వయసుతో సమంబంధం లేదు - ప్రతి ఒక్కరూ బానిసలవుతున్నారు : ఐశ్వర్య రాయ్
- Faria Abdullah: సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ గుర్రం పాపిరెడ్డి సాంగ్
కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల
Arjun Chakravarthy Producer Srini Gubbala
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల సినిమా విశేషాలు పంచుకున్నారు.
- తొలి సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తీసుకోవడానికి కారణం క్రియేటివ్ గా ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు కొన్ని కథలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపిస్తున్నంత సీరియస్ గా ఇప్పటివరకు సినిమా రాలేదు. కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అవుతుందని చాలెంజ్ గా తీసుకుని సినిమా చేశాం.
- నల్గొండలో కబడ్డీ ప్లేయర్ నాగులయ్య. అతనిని అర్జున్ అని కూడా పిలుస్తారు. ఆయన అద్భుతమైన ప్లేయర్. ఆయన జీవితంలో ట్రూ ఈవెంట్స్ 60 % , 40% ఫిక్షన్ తో ఈ కథని చేయడం జరిగింది. సినిమా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది.
- ఈ సినిమాని చేయడానికి ఎక్కువ కాలం పట్టింది. కారణం ఈ కథ అలాంటిది. హీరోకి నాలుగైదు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. అన్ని మెయిన్ క్యారెక్టర్స్ కి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ కి ట్రాన్స్ఫర్మేషన్ 9 నెలలు పట్టేది.
- ఇలాంటి కథని ఒక స్టార్ హీరో తో చేస్తే, దానికోసం చాలా సమయాన్ని కేటాయించాలి. అంతా సమయం కేటాయించే వీలు అందరికీ ఉండదు. అలాగే సినిమాని అథెంటిక్ గా తీసి ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లాలని మేము భావించాం. ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తున్నప్పుడు అందరూ చాలా అభినందించారు.
- ప్రొడక్షన్లో చాలా విషయాలు నేర్చుకున్నా. అనుకున్న బడ్జెట్ కి ఫైనల్ గా వచ్చే బడ్జెట్ కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. బడ్జెట్ పెరుగుతుంది. అయితే క్వాలిటీలో రాజీ పడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించడం జరిగింది.
