నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్
భారతీయ మహిళ నిమిష ప్రియ మరణశిక్షను యెమెన్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తనను నిరంతరం వేధిస్తూ వచ్చిన వ్యక్తిని హత్య చేసినందుకుగాను కేరళకు చెందిన ఈ నర్సుకు యెమెన్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ శిక్షను బుధవారం అమలు చేయాల్సివుంది. అయితే, యెమెన్ అధికారులు మాత్రం ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ శిక్షను అమలు చేయాల్సివుండగా, భారత అధికారులు యెమెన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె మరణశిక్ష అమలును తాత్కాలికంగా యెమెన్ అధికారులు వాయిదా వేశారని భారత విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.
నిమిష ఉరిశిక్షను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో అని రకాలైన సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషయలో కేంద్ర ప్రభుత్వం నిమిష కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. మృతుడి కుటుంబంతో నిమిష ప్రియ కుటుంబం చర్చల కోసం మరింత గడువు కోవాలని భారత్ బలంగా కోరింది. అందుకే చివరి నిమిషంలో ఈ శిక్షను యెమెన్ అధికారులు నిలిపివేశారు.
కాగా, ఈ కేసు మొదలైనప్పటి నుంచి నిమిష ప్రియకు అన్ని విధాలా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. నిమిష కుటుంబం, భారత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే మరణశిక్ష వాయిదా పడినట్టు సమాచారం.