రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేఎ పాల్ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ... రెండేళ్ల క్రిందట రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యాలని ప్రజలకందరికీ చెప్పాను. తెలంగాణకు బెస్ట్ సీఎంను తెద్దాం ఓటెయ్యమని చెప్పా. నా మాట విని ఓట్లు వేసారు. తీరా చూస్తే ఆయన వరెస్ట్ సీఎం అయ్యారు. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అన్నీ అబద్ధపు వాగ్దానాలు చేసారు.
ఇప్పుడు డబ్బులివ్వమంటుంటే ఎంతమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రజల గోడును పట్టించుకోండి అంటూ ఆయనను స్వయంగా కలిసి చెప్పాను. నేను ఏవైతే సలహాలు ఇచ్చానో... సరిగ్గా ఆ సలహాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ రెండేళ్లలో ఆయన పాలన ఎంతమాత్రం బాగాలేదనీ, ఒకప్పుడు కోటి రూపాయలు పలికిన ఎకరం భూమి రూ.50 లక్షలైంది, నాలుగైదు కోట్లు పలికే ఇళ్లు ఇప్పుడు రెండు కోట్లకు పడిపోయాయి.
ఐతే ఆయన, ఆయన చుట్టు వున్నవారు బాగా బాగుపడ్డారు. ఏకంగా 9 వేల ఎకరాలను అమ్మేసి 5 లక్షల కోట్లను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఈ సమావేశానికి ఏ దేశ అధ్యక్షుడు రావడంలేదు. బడా పారిశ్రామికవేత్తలు కూడా రావడంలేదు. ఎంతోకొంత తెలంగాణ భూములను తక్కువకే లాగేసేవారు వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటి మీద నేను మొత్తం 18 కేసులు వేస్తున్నాను. దేవుడి మాట విని సరైన దారిలో వెళ్లమని చెబితే, ఆయన సైతాన్ బాటలో వెళ్తున్నారు. ఇక ఆయనకు తగిన గుణపాఠం చెప్పేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలంటూ ఓ వీడియోలో మాట్లాడారు పాల్.