పుట్‌బాల్ జెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి.. లియోనల్ మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు రెడీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్ బాల్ ఆడుతూ కనిపించారు. తాజాగా సీఎం అయినా కూడా రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్‌పై ప్రేమను కోల్పోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జెర్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు సిద్ధంగా వున్నట్లు గల ఫోటో వైరల్ అవుతోంది.
రేవంత్ తాజా చిత్రంలో, ఆదివారం రాత్రి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫుట్‌బాల్ జెర్సీలో కనిపిస్తున్నారు. రేవంత్ ఈ ఫోటోలో ముఖ్యమంత్రి ఆర్సెనల్ జట్టు జెర్సీలో కనిపిస్తున్నారు.
డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్న GOAT ప్రచారంలో భాగంగా లియోనెల్ మెస్సీతో ఆడే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ ఆటకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, మెస్సీ మైదానంలో ఫుట్‌బాల్ ఆడే దృశ్యాన్ని చూసేందుకు ఫుట్ బాల్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.